6వ రోజు కాస్త డ్రాప్ అయిన సర్కారు వారి పాట కలెక్షన్లు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  విడుదలయిన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర సర్కారు వారి పాట సినిమా మిక్సీడ్  టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఆ టాక్ ప్రభావం సినిమా కలెక్షన్ లపై ఏ మాత్రం పడకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినాతో అదిరిపోయే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట సినిమా సాధించింది. ఇప్పటి వరకు ఆరు రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.


మొదటి రోజు : 36.01 కోట్లు
రెండవ రోజు : 11.04 కోట్లు
మూడవ రోజు : 12.01 కోట్లు
నాలుగవ రోజు : 12.06 కోట్లు
ఐదవ రోజు : 3.64 కోట్లు
ఆరవ రోజు సర్కారు వారి పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు ఏరియా వైజ్ గా చూసుకుంటే.


నైజాం : 76 లక్షలు
సీడెడ్ : 30 లక్షలు
యూ ఎ : 34 లక్షలు
ఈస్ట్ : 30 లక్షలు
వెస్ట్ : 20 లక్షలు
గుంటూర్ : 13 లక్షలు
కృష్ణ : 19 లక్షలు
నెల్లూర్ : 10 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా ఆరవ రోజు 2.32 కోట్ల షేర్,  4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఆరు రోజుల బాక్సాపీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా  94.02 కోట్ల షేర్ , 148 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: