నాతో చేయడానికి హీరోయిన్లు ఒప్పుకోవడం లేదు : రాజశేఖర్..!
ఈ క్రమంలోనే వేదికపై రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ముందు మాకు కరోనా వచ్చింది. మృత్యువుకి దగ్గరగా వెళ్లి మరి వెనక్కి తిరిగి వచ్చాము.. ఇక మమ్మల్ని మీరే బ్రతికించారు. అలాగే ఈ సినిమా చూసి మా బ్రతుకు తెరువు ను కూడా మీరే బ్రతికించండి.. మీరంతా కచ్చితంగా ఈ నెల 20వ తేదీన థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి.. ఇప్పటికీ చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మా అమ్మానాన్న మీకు విపరీతమైన అభిమానులు.. ఒక సెల్ఫీ ఇవ్వండి అంటూ అడుగుతూ ఉంటారు. ఇక వాళ్లందర్నీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ కోసం మీ అమ్మానాన్నల కోసం కచ్చితంగా థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి .వారికి కూడా చూపించండి అంటూ రాజశేఖర్ తెలిపాడు.
ఇకపోతే తన భార్య గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను మొత్తం జీవిత ముందుకు తీసుకువచ్చింది. ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ.. మరొకవైపు దర్శకత్వం బాధ్యతలు చూసుకుంటూ చాలా బాధ్యతగా ముందుకు తీసుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇదంతా ఆమె కష్టం మాత్రమే. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో మా ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ల అమ్మకు బాగా సహాయం చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ కూడా సూపర్ గా చేశారు. కానీ నాలాంటి ఓల్డ్ హీరోలతో పని చేయడానికి చాలా మంది హీరోయిన్ లు ఒప్పుకోవడం లేదు. ఇక పోతే ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ఒప్పుకొని నేను కూడా ఈ సినిమాలో యంగ్ గా ఉండే లాగా నన్ను తీర్చిదిద్దారు. అందుకే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ స్పీచ్ ముగించాడు రాజశేఖర్.