ఫ్లాప్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్ లను సాధించిన కన్మణి రాంబో ఖతీజా..!

Pulgam Srinivas
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని సినిమా లకు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ ల పరంగా మాత్రం కొన్ని సినిమాలు హిట్ స్టేటస్ ను అందుకోలేకపోతున్నాయి.  కాకపోతే తాజాగా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్మణి రాంబో ఖతీజా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది,  కానీ సూపర్ హిట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

 
కన్మణి రాంబో ఖతీజా మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్ లను గమనిస్తే...
తమిళనాడు ఏరియా లో : 38.40 కోట్లు
కర్ణాటక ఏరియా లో : 4.10 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో  : 2.75 కోట్లు
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఈ మూవీ  :  1.25 కోట్లు
ఓవర్ సీస్ లో  దాదాపు గా 17.60 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
మొత్తంగా కన్మణి రాంబో ఖతీజా సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 64.10 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

 
ఈ సినిమా 25 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకోగా , 50 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది.  అలా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఈ సినిమా ఏకంగా 64.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించుకొని ఫ్లాప్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్ లను సాధించిన మూవీ గా నిలిచింది. ఈ మూవీ ని దర్శకుడు విగ్నేష్ శివన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: