ఎఫ్-3 నుంచి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ వీడియో వైరల్..!!

Divya
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా వరుణ్ తేజ్ మరోక హీరోగా నటిస్తున్న చిత్రం f-3. ఈ సమ్మర్ లో వీరి హావ నే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. ఈ మూవీకి నిర్మాతగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా పక్క కామెడీ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిచడం జరుగుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈ సినిమా కి గ్లామర్ జోడించి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా వచ్చిన పాటని తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇందు లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. ఈ పాట వీడియో లిరిక్స్ విడుదల కావడంతో ఈ పాటతో  భారీగా అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో ఈ సాంగ్ ని పాడారని చెప్పవచ్చు.
పూజా హెగ్డే డాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయనే చెప్పవచ్చు. వెంకటేశ్ ,వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఇక నాగిని మ్యూజిక్ కి పూజ హెగ్డే, వరుణ్ తేజ్, వెంకటేష్ వేసే స్నేక్ డ్యాన్స్ ప్రేక్షకులను బాగా అలరించెలా ఉంది. ఈ సాంగ్ లో సునీల్ తో పాటుగా రాజేంద్రప్రసాద్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సాంగుకు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం బాగా ఉపయోగపడుతుంది. గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఫుల్ ఎనర్జీతో పాడారు. ఇప్పటివరకు ఎఫ్-3  నుండి రెండు పాటలు విడుదల ఒక మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇందులో తమన్నా, మెహరీన్ , సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: