ఇది క‌దా పంచ్ అంటే : వాళ్ళకి నోళ్ళకి .... గట్టి తాళం వేసిన మహేష్ .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా విజయాలతో తన కెరీర్ లో సూపర్ గా జోష్ లో ఉన్నారు. మహేష్ ఇటీవల విడుదలైన మూడు సినిమాల ద్వారా ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ లు సొంతం చేసుకోవడంతో పాటు మొన్న విడుదలైన సర్కారు వారి పాట కూడా మరొక భారీ సక్సెస్ కొట్టి ఆయన ఖాతాలో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా సముద్రఖని విలన్ రోల్ చేసారు. 

నేటి సమాజానికి మంచి మెసేజ్ తో పాటు యాక్షన్, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సర్కారు వారి పాటలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ పాత్ర చేసారు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియన్స్ మనసు కూడా గెలిచిన మహేష్, ప్రస్తుతం ఈ మూవీ తో పలు చోట్ల రికార్డులు కొల్లగొతున్నారు. అయితే విషయం ఏమిటంటే, సర్కారు వారి పాట నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు, ట్రైలర్ వరకు అన్నింటి ద్వారా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచింది.

అయితే మూవీ విడుదల రోజున కొందరు పని గట్టుకుని నెగటివ్ టాక్ తేవడంతో పాటు ఏకంగా మరికొందరు సోషల్ మీడియాలో సినిమా బాగాలేదు అంటూ నెగటివ్ ట్రెండ్ చేసారు. సినిమాలో మంచి కంటెంట్ ఉండడంతో పాటు మహేష్ బాబుకి అన్ని వర్గాల ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తోడు కావడంతో సర్కారు వారి పాట తొలి రోజు నుండి సూపర్ గా కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట మార్క్ షేర్ సొంతం చేసుకుని మహేష్ కెరీర్ లో త్వరగా వంద కోట్ల షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ రికార్డులతో మహేష్ బాబు తమ సినిమా పై నెగటివిటీ చేసేవారి అందరి నోళ్లకు తాళం వేశారని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: