విజయ్ దేవరకొండ మితిమీరిన సాహసానికి షాక్ లో పవన్ అభిమానులు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ లానే పవన్ అభిమానులు కూడ ఎప్పుడు ఆవేశంతో ఉన్నారు. పవన్ పై ఎవరు నెగిటివ్ కామెంట్స్ చేసిన అతడి అభిమానులు ఏమాత్రం సహించరు. అలాగే పవన్ నటించిన సినిమాలు అంటే అతడి అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఇలాంటి పరిస్థితులలో యూత్ కు ఐకాన్ గా ఒక వెలుగు వెలుగుతున్న విజయ్ దేవరకొండ చేసిన సాహసం పవర్ స్టార్ అభిమానులకు ఆశ్చర్యంతో పాటు విపరీతంగా షాక్ కు గురవుతున్నారు.

‘లైగర్’ విడుదల కాకుండానే విజయ్ దేవరకొండ మరొక సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఒక క్యూట్ లవ్ స్టోరీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈమూవీ టైటిల్ ను ‘ఖుషీ’ అని ఫైనల్ చేయడం పవన్ అభిమానులకు షాక్ ఇస్తోంది.

పవన్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఖుషీ’ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ ఆసినిమాను టివీ లలో ప్రసారం అవుతున్నప్పుడు బుల్లితెర ప్రేక్షకులు బాగా చూస్తూ ఉంటారు. అలాంటి క్రేజీ టైటిల్ ను ఏధైర్యంతో అత్యుత్సాహంగా విజయ్ దేవరకొండ తన సినిమాకు ఎంచుకున్నాడు అంటూ పవర్ స్టార్ అభిమానులు షాక్ లో ఉన్నారు. దీనికితోడు ఒక ట్రెండ్ సెటర్ గా మూవీగా ‘ఖుషీ’ కి మంచి పేరుంది. అలాంటి టైటిల్ తో ఉన్న సినిమాలో నటించి ఈనాటి యూత్ ను ముఖ్యంగా పవన్ అభిమానులను మెప్పించడం విజయ్ దేవరకొండకు పరీక్ష అనుకోవాలి.

ఇది ఇలా ఉంటే ఈమూవీని ఈసంవత్సరం డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ముందుగానే విజయ్ దేవరకొండ క్రిస్మస్ రేస్ లో తన స్థానాన్ని అడ్వాన్స్ గా బుక్ చేసుకుని మరొక హీరో క్రిస్మస్ రేస్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈమూవీకి సంబంధించి రిలీజ్ అయిన లేటెస్ట్ పోష్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ తో పాటు అతడి కాష్ట్యూమ్స్ కూడ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: