ఆ పాత్ర గురించి మాత్రం అస్సలు అడగద్దు...అనిల్ రావిపూడి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరుఎం అనిల్ రావిపూడి ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరియర్ ను పటాస్ సినిమా తో మొదలు పెట్టాడు. పటాస్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సుప్రీమ్,  రాజా ది గ్రేట్ , ఎఫ్ 2,  సరిలేరు నీకెవ్వరు సినిమాలకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ లుగా నిలిచాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎఫ్ 2  సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.  ఎఫ్ 3 మూవీ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా,  మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది.  పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఈ సినిమా మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సోనాల్ చౌహాన్ పాత్ర గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ... సోనాల్ చౌహాన్ పాత్ర గురించి మాత్రం అడగొద్దు,  అది మూవీ లో ఒక సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి,  ఆమె మూవీ లో ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే ఆ పాత్ర గురించి  చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది" అంటూ తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: