రాజా డీలక్స్ : అనుష్క ఫిక్స్.. ఇంకా ఇద్దరు హీరోయిన్లు..?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సలార్' ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో పాటు తన తరువాతి ప్రాజెక్టులపై కూడా ప్రభాస్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాని పూర్తి చేసిన ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ K' షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు. అంతేగాక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో కూడా 'స్పిరిట్' అనే సినిమాను కూడా ఇప్పటికే రెబల్ స్టార్ అనౌన్స్ చేశాడు.అలాగే ఆ మధ్య మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ అనే సినిమా కూడా చేయనున్నట్లు ప్రచారం మొదలైంది. ఇక టైటిల్ తో సహా వచ్చిన సోషల్ మీడియా న్యూస్ అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒకింత కలవర పెట్టినా కానీ మారుతి స్టయిల్ ఆఫ్ కామెడి టైమింగ్ తో సినిమా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చర్చించుకున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.


ఇక ఇప్పుడు ఈ సినిమాపై జరుగుతున్న చర్చ ప్రకారం.. భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట.ఇక ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అని గతంలోనే ప్రచారం జరగగా.. ఆ రూమర్ నిజమేనని ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది.అలాగే ఇప్పటికే మారుతీ అనుష్కతో చర్చలు కూడా జరపగా.. అలాగే మిగతా ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ హంటింగ్ మొదలు పెట్టారట. ప్రభాస్-అనుష్క ది మంచి హిట్ కాంబినేషన్. బాహుబలి సినిమా తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్లే మారుతీ ఈ కాంబినేషన్ ని సెట్ చేసి ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: