RRR టీంని దారుణంగా ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్!

Purushottham Vinay
యస్ యస్ రాజమౌళి rrr టీమ్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. రాజమౌళిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక దీనికి కారణం ఏంటంటే rrr టీమ్ చేసిన ఓ ట్వీట్. గత రెండు మూడు రోజుల నుంచి నెట్టింట్లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వల్ల తీవ్ర అసహనంతో ఇంకా కోపంతో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్‌ని rrr టీమ్ చేసిన ట్వీట్ ఇంకాస్త ఇబ్బంది పెట్టింది.దీంతో రాజమౌళితో సహా rrr సినిమా యూనిట్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలోచాలా రచ్చ రచ్చగా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సర్కారు వారి పాట' మూవీ తొలి షోతోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జనం మెచ్చిన సినిమాగా భారీ వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సక్సెస్‌పై టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ కూడా పెద్దగా స్పందించకపోవడంతో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. సర్కారు వారి పాట సినిమా విడుదలై మూడు నాలుగు రోజులు గడుస్తున్నా కానీ టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఇంకా హీరోలు స్పందించక పోవడం పట్ల గుర్రుగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


వారి ఆగ్రహానికి మెగా హీరోల పరువు పూర్తిగా పోయింది. ఇక ఈ పరిస్థితుల నడుమ rrr సినిమా యూనిట్ చేసిన ట్వీట్ మరింత కాక రేపడమే గాక రాజమౌళిపై కూడా ట్రోలింగ్‌కి కారణమైంది.తన తోటి హీరోల సినిమాలు విడుదలై మంచి సక్సెస్ బాటలో వెళుతుంటే సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు కంగ్రాట్స్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో కూడా rrr సినిమా గురించి కూడా మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే rrr సినిమా టీమ్ మహేష్ బాబు ప్రెస్టేజియస్ మూవీ 'సర్కారు వారి పాట' సినిమాపై మౌనం పాటిస్తూ తమిళ హీరో శివ కార్తికేయన్ 'డాన్' సినిమా గురించి రియాక్ట్ అయింది. 'డాన్' సినిమా సక్సెస్‌పై ట్వీట్ పెడుతూ 'డాన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కొంచెమైన విశ్వాసం లేదా అంటూ ఓ రేంజిలో రాజమౌళి పై ఇంకా ఆర్.ఆర్.ఆర్ సినిమా యూనిట్ పై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: