అందాల ముద్దుగుమ్మ సమంత గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. సమంత తన కెరియర్ లో ఇప్పటివరకూ దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లోని అందరూ టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటికే శాకుంతలం , యశోద సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.
ఈ సినిమాలతో పాటు సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 23 డిసెంబర్ 2022 వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ఇలా వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ మీద ఉన్న సమంత తాజాగా ఒక మీడియా సంస్థ ప్రకటించిన తెలుగు స్టార్ హీరోయిన్ ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అసలు విషయంలోకి వెళితే... వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ అయిన నటులు ఎవరనే విషయం లో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' ఒక సర్వే ను తాజాగా నిర్వహించింది.
ఈ సర్వేలో తెలుగు స్టార్ హీరోయిన్ ల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్, మూడవ స్థానంలో అనుష్క శెట్టి , నాలుగవ స్థానంలో పూజా హెగ్డే, ఐదవ స్థానంలో రష్మిక మందన, ఆరవ స్థానంలో తమన్నా , ఏడవ స్థానంలో కీర్తి సురేష్, ఎనిమిదవ స్థానంలో సాయి పల్లవి , తొమ్మిదవ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్, పదవ స్థానంలో రాశి ఖన్నా నిలిచారు.