భవిష్యత్తులో ఓటిటి లదే హవా... థియేటర్ లు మూసుకోవాల్సిందేనా ?

VAMSI
పెరుగుతున్న ఓటిటి ల జోరు కొత్త కొత్త ప్లానింగ్ లతో పోటీ పెరుగుతున్న తరుణంలో ప్రశ్నార్ధకంగా మారిన థియేటర్ల భవిష్యత్తు..!!! ఒకప్పుడు ఓ టి టి వేదికంటూ ఒకటుందని పెద్దగా ప్రజలకు తెలియదు, ఇక వెబ్ సిరీస్ లైతే ఆ మాట కూడా కనీసం చాలామందికి తెలియదు. అలాంటిది కరోనా ఏమని వచ్చిందో కానీ పరిస్థితులు అన్ని తారుమారు అయ్యాయి. ఈ క్రమంలో అన్ని రంగాలు కుదేలు పడగా ఒక్క డిజిటల్ రంగం మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. కరోనా లాక్ డౌన్ టైం లో ఏదైనా అభివృద్ధి చెందింది అంటే అది ఓ టి టి ఫ్లాట్ ఫామ్ మాత్రమే. లాక్ డౌన్ తో ఇంట్లో లాక్ అయిన వారంతా ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ వేదికకు అలవాటు పడ్డారు. ఇక కరోనా అనంతరం కూడా ఓ టి టి లకు బాగా అలవాటు పడ్డ జనాలు థియేటర్ల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు.
ఈ లాక్ డౌన్ టైం లో వెబ్ సిరీస్ లకు కూడా బాగా అడిక్ట్ అయిపోయారు. స్టార్  హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల లో నటించడంతో వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందులోనూ లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ ప్రేక్షకులు ఒకప్పటిలా సినిమా హాళ్ళలో సినిమాలు చూడటానికి పరుగులు తీయడం లేదు. పెద్ద స్టార్స్ చిత్రాలు అయితే తప్ప ఒక మోస్తరు ప్రేక్షకులను కూడా థియేటర్ లోకి తీసుకురావడం కష్టంగానే ఉంటోంది. అందులోనూ టికెట్ల ధరలు బాగా పెరగడంతో ఇది కూడా ఒక కారణంగా మారింది. ఇవన్నీ ఇలా ఉండగా... ఓ టి టి ఓటీటీ వేదికలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, ఉన్న వారిని నిలబెట్టుకునేందుకు గట్టిగా పోటీ పడుతున్నాయి.
నూతన చిత్రాలను, సరికొత్త వెబ్‌సిరీస్‌ లను ఆఫర్లతో ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక అయిన  ఆహా...40 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ముందుకొచ్చింది. అటు మరో ఓటీటీ వేదిక అయిన జీ5 కూడా తగ్గేదేలే అన్నట్లు ఏకంగా 80 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అటు అమెజాన్ ప్రైమ్ సైతం ఈ పోటీలో గట్టిగానే ప్రయత్నిస్తోంది ఇలా పోటీ వేదికలు ఒకదానిపై ఒకటి పోటీపడి మరీ తమ వైపు తిప్పుకునే నేపథ్యంలో థియేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: