హరీష్ శంకర్ కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు కొంత కాలం గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాడు.  పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటించిన వఖిల్ సబ్, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి.  

ఇలా రీ ఎంట్రీ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అలా ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా,  మరో ముఖ్యమైన పాత్రలో నోరా ఫతేహి నటించబోతున్నట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొంతకాలం పాటు వాయిదా పడిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే తిరిగి ప్రారంభం అయ్యింది.

తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాను  పట్టా లెక్కించాలి అనుకున్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ప్లాన్ ని మార్చుకొని తమిళ సినిమా వినోదయ సీతం ను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.  దీనితో హరీష్ శంకర్,  పవన్ కళ్యాణ్ తో తీయబోయే సినిమా కోసం మరికొంత కాలం వేచి ఉండవలసి వచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: