హాట్ టాపిక్ గా మారిన హరీష్ శంకర్ బండ్ల గణేష్ ల రాజకీయం !

Seetha Sailaja

బ్లాక్ బష్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎలాంటి గొప్ప వ్యక్తిని అయినా భారీ గిఫ్ట్స్ ఇచ్చి బుట్టలో పడేద్దామని తరుచు ప్రయత్నిస్తూ ఉంటాడు. మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా చిరంజీవి పవన్ లకు వీరవిధేయుడైన బండ్ల గణేష్ ఏమి చేసినా అది సంచలనమే. లేటెస్ట్ గా ఈ మెగా నిర్మాత ‘గబ్బర్ సింగ్’ మూవీ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఒక ఖరీదైన వాచ్ ని హరీష్ శంకర్ కు బహుమతిగా ఇచ్చాడు.

తాను హరీష్ శంకర్ కు ఇచ్చి ఆ ఖరీదైన బహుమతికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారింది. గత కొంత కాలంగా బండ్ల గణేష్ హరీష్ శంకర్ ల మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది అంటూ గుసగుసలు వినిపించా. అయితే రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు అన్న విషయాన్ని బండ్ల గణేష్ మరొకసారి రుజువు చేసాడు.

వాస్తవానికి బండ్ల గణేష్ కు పవన్ తో మరో భారీ సినిమాను తీయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అయితే పవన్ ఎందుకనో తన వీరాభిమానికి సహకరించడం లేదు. హరీష్ శంకర్ పవన్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరపుకోవలసిన ‘భవధీయుడు భగత్ సింగ్’ ప్రాజెక్ట్ ఫైనల్ అయినప్పటికీ ఆమూవీ ఎప్పుడు మొదలవుతుందో హరీష్ శంకర్ కు తెలియని పరిస్థితి. దీనితో పవన్ డేట్స్ గురించి వేచి చూస్తూ హరీష్ శంకర్ రోజులు లేక్కపెడుతున్నాడు.

ఇప్పుడు మళ్ళీ హరీష్ శంకర్ బండ్ల గణేష్ ల స్నేహం మళ్ళీ చిగురించింది కాబట్టి పవన్ డేట్స్ ఇచ్చేలోగా బండ్ల గణేష్ హరీష్ శంకర్ తో ఎవరైనా ఖాళీగా ఉన్న మెగా యంగ్ హీరోతో సినిమా చేస్తాడేమో చూడాలి. హరీష్ శంకర్ తన కుటుంబ సబ్యుడు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోతో పాటు ఖరీదైన గిఫ్ట్ కూడ అందరి దృష్టిని ఆకరిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: