సినిమా మొదలు కాలేదు..అప్పుడే ప్రీరిలిజ్ బిజినెసా?

Satvika
సినిమా షూటింగ్ పూర్తీ అయ్యి పోస్టర్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ లను బట్టి వచ్చే టాక్ తో సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతాయి.. కానీ ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్న సినిమా పై ముందుగానే అంచనాలు కూడా భారీగా పెరిగాయి.దాంతో సినిమా షూటింగ్ కూడా మొదలు కాక ముందే సినిమా పై అంచనాలు పెరగడంతో ప్రీరిలిజ్ బిజినెస్ కూడా మొదలు కావడం విశేషం.తెలుగు సినీ చరిత్రలో ఇది కని, విని ఎరుగని విషయం అనే చెప్పాలి.



అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే..మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేయడంతోనే ఈ స్థాయి సక్సెస్ దక్కింది. ప్రమోషన్స్ చేసింది లేదు. పెద్దగా అంచనాలూ లేవు. అయినా సరే పుష్పరాజ్ ను నార్త్ ఆడియెన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు. ఎలాగూ సౌత్ లో బన్నీకున్న క్రేజ్ తో పుష్ప ది రైజ్ ఇక్కడా సక్సెస్ కొట్టింది..



పుష్ప 2పై అంచనాలు పెరిగిపోయాయి. సో సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో పెరిగింది. అందుకే ఆ అంచనాలను మించేలా పుష్ప2 తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇక ఈ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైనట్లు కొద్దిరోజులుగా విపరీతంగా గాసిప్స్ ఫిలిం  ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతున్నాయి.నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ. 300 కోట్లకి పైగా డీల్ వస్తున్నాయని బజ్ వినిపించగా.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కలిపి రూ. 500 నుంచి రూ.600 కోట్లకి పైగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.బిజినెస్ మాములుగా లేదు..ఇది నిజం అయితే బన్నీ ,సుక్కు రేంజ్ పీక్స్ కు వెళ్ళడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: