కేజీఎఫ్ 2 : బాహుబలి 2 నే మించిపోయిందిగా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు కూడా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్‌ సినీ ప్రేమికులకు కూడా బాగా నచ్చింది. బాహుబలి 2 అనేది ఒక పెద్ద సంచలనంగా నిలిచింది. 1800 కోట్ల వసూళ్లను రాబట్టిన బాహుబలి 2 సినిమా రికార్డును రాబోయే పదేళ్ల వరకే కాదు ఆ తర్వాత కూడా బ్రేక్ చేయడం సాధ్యం కాదని అంతా కూడా భావించారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమా దాదాపుగా ఆ రికార్డును చేరువ అయ్యింది. చాలా ఏరియాలో బాహుబలి 2 రికార్డును కూడా తుడ్చి పెట్టిన కేజీఎఫ్ 2 సినిమా బాహుబలి మెయిన్‌ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇక ఇదే సమయంలో బాహుబలి సినిమా తో పోల్చితే కేజీఎఫ్ 2 సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ కన్నడ మీడియా వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఒక సారి కాదు పది సార్లు చూసినా కూడా కేజీఎఫ్ 2 సినిమా కథ ఏంటీ అనేది ఎవరికి అర్థం కావడం లేదు అనేది ఒక విమర్శ కాగా.. కేవలం యాక్షన్ సన్నివేశాల వల్ల సినిమాను నడిపించారు అనేది మరో అభిప్రాయం అని తెలుస్తుంది.కేవలం యాక్షన్ సన్నివేశాలతో కేజీఎఫ్ 2 సినిమాను సక్సెస్ చేసిన ఘనత కేవలం ప్రశాంత్‌ నీల్‌ కు దక్కింది అంటున్నారు. ఇక 150 కోట్ల బడ్జెట్‌ తో ఏకంగా 1200 కోట్ల దాకా వసూళ్లను దక్కించుకున్న సినిమాగా ఈ సినిమా రికార్డు సాదించింది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కూడా కేజీఎఫ్ 2 సినిమా తర్వాతే అంటూ కన్నడ మీడియా వారు ప్రచారం చేస్తున్నారు. బాహుబలి 2 సినిమా బడ్జెట్‌ కు వచ్చిన వసూళ్లను ఇంకా అలాగే కేజీఎఫ్ 2 బడ్జెట్‌ ఇంకా వసూళ్లను పోల్చితే ఖచ్చితంగా బాహుబలి కంటే గొప్ప విజయాన్ని కేజీఎఫ్ దక్కించుకుందంటూ కన్నడ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: