ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ లాంటి న్యూస్..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ సినిమాలు చేఏస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ పూర్తి చేయగా సలార్ ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె కూడా లైన్ లో ఉంది. అయినా సరే మారుతి డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు రాజా డీలక్స్ అని టైటిల్ కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాని కూడా యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తారట.
అయితే మారుతి డైరక్షన్ లో వచ్చే సినిమా మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇయర్ అక్టోబర్ నుండి మొదలు పెట్టి జనవరి కల్లా సినిమా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు 2023 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి ఖర్చీఫ్ వేయగా లేటెస్ట్ గా మారుతి సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుందని అంటున్నారు.
అంటే ఈ లెక్కన ప్రభాస్ ఫ్యాన్స్ కి 2023 లో రెండు సినిమాలతో సందడి చేయనున్నారు. రాధే శ్యాం సినిమా నిరాశపరచినా ఆదిపురుష్ సినిమాతో అంతకుమించి హిట్ అందుకోవాలని చూస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ తన నటనతో అందరిని మెప్పిస్తారని అంటున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ నటిస్తున్నారు. ఇవే కాదు ప్రాజెక్ట్ కె హాలీవుడ్ సినిమాగా రాబోతుంది. దాదాపు ఆ సినిమా బడ్జెట్ 500 కోట్లకి అటు ఇటుగా ఉంటుందని అంటున్నారు. దీని తర్వాత సందీప్ వంగ డైరక్సన్ లో స్పిరిట్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు ప్రభాస్. అర్జున్ రెడ్డి డైరక్టర్ డైరక్షన్ లో ప్రభాస్ చేసే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: