పవన్ ఆ దర్శకుడికి చుక్కలు చూపిస్తున్నాడా!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోలకు సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని ఇతర ఆసక్తులు కూడా ఉంటాయి. వాటిలో వారికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే వారు అందులోకి దిగి అక్కడ కూడా రాణించాలని చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాలలో సైతం రాణించాలని ఓ కోరిక ఉంది. అందుకే గత పది సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన రాజకీయాలలో పాల్గొంటున్నారు. పోయిన ఏడాది ఆయన దారుణమైన పరాజయాన్ని అందుకున్న కూడా ఏ మాత్రం నిరాశ పడకుండా ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ అక్కడి నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందుకే ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు రాజకీయాలలో ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు. ఆ విధంగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చకపోయినా కూడా సినిమాలు కూడా చేయడంతో ఆయనను తెగ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలలో పూర్తిగా బిజీ అవ్వకముందే సినిమాలు చేయాలని చెప్పి తెలుగునాట వరుస సినిమాలను ఓకే చేసుకుంటున్నాడు.

రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరిగాయి. అయితే ఈ సినిమాను పవన్ పూర్తిగా పక్కన పెట్టడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టక పోవడం ఈ సినిమా లేదనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ క్రిష్ సినిమా ను కొన్ని రోజులు వాయిదా వేసి ఇంత దూరం షూటింగ్ జరిగేలా చేశాడు పవన్ కళ్యాణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: