వినూత్నమైన కథలకు కేరాఫ్ అడ్రస్ రవితేజ!!

P.Nishanth Kumar
మాస్ రాజా రవితేజ మొదటి నుంచి కూడా తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా చేసుకున్నాడు. ఆయన కు అందుకే పెద్దగా ఫ్లాపులు వచ్చినా కూడా మినిమమ్ గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ అయితే ఏర్పడుతుంది. ఆయన సినిమాల్లో మంచి కామెడీతో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అందరి హీరోల అభిమానులు ఆయన సినిమాలు చూస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు.

ఇటీవల కిలాడి సినిమాను విడుదల చేసిన రవితేజ ఇప్పుడు రామారావు డ్యూటీ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించే విధంగా చేస్తున్నా డు ఆ తర్వాత ఆయన మరిన్ని సినిమాలు చేయడం రవితేజ అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న రావణాసుర సినిమా కూడా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ ఏడాది ఆ చిత్రం కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

మరొకవైపు త్రినాథ రావు దర్శకత్వంలో చేసిన ధమాకా చిత్రం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఆయన చేస్తు న్న నాలుగు సినిమాలను ఈ ఏడాది లో విడుదల చేసి ఆ తర్వాత ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమాను సైతం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన రవితేజ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది ప్రథమ భాగంలో విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. ఆ విధంగా ఈ తరం హీరోలకు అందకుండా వరుస సినిమాలు చేస్తూ తన ఎనర్జీ నీ చాటుకుంటున్నాడు.ఇప్పుడున్న హీరో లలో రవితేజ లా ఇన్ని సినిమాలు ఒకే సారి చేసే హీ రో ఎవరు లేరనే చెప్పాలి. రోజుకు రెండు మూడు సినిమాల షూటింగ్ లలో అయన పాల్గొంటూ ఉండడం విశేషం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: