మెహారీన్ సర్దుకోవాల్సిందేనా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. వరుస సినిమాలు చేస్తుంది అనుకునే లోపే ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అతి తక్కువ కాలం కెరీర్. స్పాన్ ఉండే హీరోయిన్ ల కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే కానీ వారికి సరైన సినిమా భవిష్యత్తు ఉండదు. ఆ విధంగా టాలీవుడ్ లో ఓ హీరోయిన్ సినిమా కెరీర్ చివరి దశకు వచ్చేసింది అని కొంతమంది సోషల్ మీడియాలో అదేపనిగా ప్రచారం చేస్తున్నారు.

ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా... కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ మెహారీన్. తొలి సినిమాతో తన హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ విధంగానే ఆమెకు అవకాశాలు కూడా వచ్చి మంచి హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది. ఎఫ్ 2 సినిమాలో ఆమె కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా చేస్తున్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కూడా ఆమె అందర్నీ అలరించడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత ఆమె చేయబోయే సినిమాల గురించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఆమె కెరియర్ దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది అని కొంతమంది చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆమె ఒక్క సినిమా కూడా సైన్ చేయకపోవడమే ఈ విధమైన వార్తలు ప్రచారం కావడానికి అసలు కారణం. మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఆమెను హీరోయిన్ గా పెట్టుకుంటారా అనేది చూడాలి. మే 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: