జూనియర్ ను ఇరకాటంలో పెట్టిన కొరటాల సూచన !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ ఆసినిమా కోసం మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకున్న జూనియర్ కు అతడు కోరుకున్న పాన్ ఇండియా ఇమేజ్ ఆమూవీ ద్వారా దక్కకపోవడంతో తారక్ అభిమానులు తీవ్రనిరాశలో ఉన్నారు. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత జూనియర్ త్రివిక్రమ్ తో మూవీ చేయవలసిన పరిస్థితి ఉంది.

అయితే కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి త్రివిక్రమ్ మహేష్ వైపు వెళ్లిపోవడంతో జూనియర్ కొరటాల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. వాస్తవానికి ఈమూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన వెంటనే షూటింగ్ ప్రారంభించాలని కొరటాల అనుకున్నాడు. అయితే ‘ఆచార్య’ ఇచ్చిన షాక్ తో ఇప్పటివరకు ఫ్లాప్ అనే పదాన్ని ఎరుగని కొరటాల కు ఫ్లాప్ ను చూడవలసి వచ్చింది.

దీనితో కొరటాల ఎలర్ట్ అయి ఒకటికి పదిసార్లు జూనియర్ కు తాను తయారుచేసిన స్క్రిప్ట్ పై మళ్ళీమళ్ళీ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ‘ఆచార్య’ ఫలితం తరువాత ఈమధ్య కొరటాల జూనియర్ ను కలిసి తాను తయారుచేసుకున్న కథలో మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఆలోచనలు వస్తున్నాయని అందుచేత తనకు కొంత సమయం ఇవ్వమని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి జూనియర్ కూడ ఇంకా షాక్ లో ఉన్న పరిస్థితులలో స్క్రిప్ట్ విషయంలో రాజీ పడవద్దని చెప్పినట్లు టాక్. దీనితో ఈ మూవీ ఆగష్టు లేదంటే సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఒకవైపు రామ్ చరణ్ సినిమాల పై సినిమాలు చేసుకుంటూ పోతుంటే జూనియర్ మాత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ మరొక సినిమాను చేయకుండా ఇలా నెలలు సంవత్సరాలు గడిపేస్తూ ఉండటం తారక్ అభిమానులకు తీవ్ర నిరాశ కల్గిస్తున్నట్లు టాక్. దీనితో ఈనెలలో రాబోతున్న జూనియర్ పుట్టినరోజునాడు అయినా తమ హీరో తదుపరి సినిమా పై క్లారిటీ ఉంటే బాగుంటుంది అన్న భావనలో అభిమానులు ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: