లెజెండ్ సీక్వెల్ కు డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే..

Satvika
నందమూరి బాలకృష్ణ ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా ఘన విజయంతో ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తున్నారు.. సినిమాల తో పాటు టీవీ షోల తో దుమ్ము రేపుతున్నాడు. ఓటీటీ షో అన్‌స్టాపబుల్ రికార్డులు చెరిపేస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈయన నటించిన హిట్ సినిమాలలో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాలయ్య కెరియర్ లో ది బెస్ట్ గా నిలిచింది.. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్.

 
2014లో విడుదలైన ఈ సినిమా 2017 వరకు థియేటర్లో ఆడింది. ఇది నమ్మడానికి  కాస్త విచిత్రంగా అనిపించినా.. రాయలసీమలోని ఎమ్మిగనూరు లో ఒక థియేటర్లో వెయ్యి రోజుల కు పైగా లెజెండ్ సినిమా ఆడింది. ఈ సినిమా 1000 రోజుల పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ పై ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది. కాగా, బాలయ్య ఇప్పుడు గోపిచంద్ మలినేని చేస్తోన్న సినిమా తర్వాత వెంటనే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.


ఈ సినిమాలో కూడా అలాంటి డైలాగులు పేలతాయి.. లెజెండ్ రేంజ్‌లో అంటే లెజెండ్ 2 అనుకోవచ్చని అంటున్నారు. బోయపాటికి కథలో పొలిటికల్ లైన్‌ ను ఎలా చూపించాలో అతనికి బాగా తెలుసు. లెజెండ్ రేంజ్‌ లో అంటే లెజెండ్ 2 అనుకోవచ్చని అంటున్నారు. బోయపాటికి కథలో పొలిటికల్ లైన్‌ను ఎలా కలపాలో బాగా తెలుసు. ఈ సినిమా ను వచ్చే మార్చి నుంచి పట్టాలెక్కిస్తారని.. ఏపీలో ఎన్నికల మూమెంట్‌ను బట్టి కాస్త ముందుగానే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణం లో వస్తుందని టాక్.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: