ప్రభాస్ బ్యానర్ నుంచి మరొక ప్రొడక్షన్..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముందు నుంచి హీరోలు నిర్మాతలుగా , డైరెక్టర్లుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఫలానా సంస్థ నుండి సినిమా విడుదల అవుతుందంటే చాలు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.AVM సంస్థ నుండి సురేష్ ప్రొడక్షన్ వరకు మంచి క్రేజ్ నిర్మాణ సంస్థలు ఉన్నవి. నేటితరం నిర్మాణ సంస్థలలో దిల్ రాజు సంస్థలతో పాటు కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు కూడా ప్రత్యేకంగా చోటుచేసుకుంటున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యు.వి.క్రియేషన్స్.

ప్రభాస్ ఈ బ్యానర్ కు బ్యాక్ బోన్ గా ఉంటున్నారు. దీంతో ఈ సమస్త అతి తక్కువ కాలంలోనే టాప్ ప్రొడ్యూసర్ కంపెనీలో నిలిచింది. దీనికి వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సరి కొత్త సినిమాలకు ఈ సంస్థల శ్రీకారం చుడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ప్రభాస్ తోనే భారీ చిత్రాలను నిర్మిస్తూ ఉంటారు. త్వరలోనే స్టార్ హీరో రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. టాలీవుడ్ లో ఎన్ని క్రేజీ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ యు.వి.క్రియేషన్స్ ఉన్న ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భారీ చిత్రాలతో పాటు మినిమం రేంజ్ హీరోల సినిమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.

అయితే చిన్న సినిమాల కోసం యువి-2 అనే బ్యానర్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు దీనిపై ఇప్పటికే పలు చిన్న సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీనికి కూడా వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సంస్థ నుండి మరొక బ్యానర్ కూడా రాబోతోంది. దీనికి మాత్రం వంశీ మాత్రమే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అట. ఈ బ్యానర్ పై చిన్న మూవీస్ మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే నిర్మిస్తున్నారు. అయితే వీటిలో ప్రభాస్ బాగస్వామ్యం ఉంటారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క  నవీన్ పోలిశెట్టి తో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: