కేవలం ఒక్క రూపాయి నెల జీతంగా తీసుకున్న దాసరి నారాయణ రావు..?

VAMSI
దర్శకరత్నా దాసరి నారాయణ రావు గురించి తెలియని వారు ఉండరు. అయన 150 చిత్రాల దర్శకుడు, అంతేకాదు అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు, ఇంకా 250 పైగా చిత్రాల రచయిత, అలాగే 53 చిత్రాల నిర్మాత కూడా. అంతేకాక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల భాషా చిత్రాలలో నటించిన ఘనత, పాత్రికేయ ప్రావీణ్యం, రాజకీయ చాతుర్యం, ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన దాసరి. మరి అంతటి ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ దాసరి నెల జీతం ఒక్క రూపాయేనా ? అంటే....అవును అనే చెప్పాలి. ఎందుకు అంటే దాసరి నెలకు ఒక్క రూపాయే జీతంగా తీసుకున్నాడు . మరి ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ లో వెళ్లాల్సిందే.

దర్శకరత్న దాసరి నారాయణ 1947 మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గ్రామంలో జన్మించాడు. కాగా వారీ తల్లి తండ్రులకు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గు అబ్బాయిల సంతానంలో దాసరి మూడో వారు. అంతేకాదు వారికి ఆస్థి పాస్తులు కూడా బాగానే ఉండేవి. అయితే దాసరి నాన్న,అలాగే వారి పెద్ద నాన్న ఇద్దరు కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు.
కాగా ఒకసారి దీపావళికి  పొగాకు గోడౌన్ అంతా తగలబడి పోవడం, దానికి తోడు అప్పుడు ఇన్సూరెన్సులు లేని కారణంగా ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బ తినడం జరిగింది. దీనితో వారి పంట పొలాలు అన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. అంతేకాదు వారి అంతకు ముందు కుటుంబంలో ఎవ్వరూ కూడా పెద్దగా చదువుకోకపోవడంతో దాసరి తరాన్ని అయనా చదివిస్తుంటే దురదృష్టం వారిని ఈ రకంగా వెక్కిరించడంతో అ సమయంలో ఆరో తరగతి చదువుతున్న దాసరి స్కూల్ ఫీజు ముప్పావుల కట్టలేక అప్పట్లో బడి మానెయ్యాల్సి వచ్చింది. దానితో దాసరి ఒక వడ్రంగి దుకాణంలో పనికి కుదిరాడు అప్పుడు దాసరి నెల జీతం రూపాయి.
అయితే ఇందులో మరో భాధాకరమైన విషయం ఏంటంటే ఆరో తరగతిలోనే ఉత్తమ విద్యార్థిగా బహుమతి అందుకున్న దాసరి నారాయణ రావు అప్పట్లో తన చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సి రావడం. ఐతే ఆ తరువాత కాలంలో ఒక మాస్టారి సహాయంతో తిరిగి తన చదువు కొనసాగించారు దాసరి. అయితే పెద్దలు చెప్పినటట్లు ఉలి చేతిలో శిల్పం ఎన్నో దెబ్బలు తింటే శిల్పంగా మారినట్లు, అలాగే నిప్పుల్లో కాలితేనే బంగారం మెరిసినట్లు , తన చిన్న తనలోనే అన్ని కష్టాలకోర్చిన వ్యక్తి కాబట్టి, దాసరి తెలుగు వారి ఘనతను ప్రపంచానికి చాటి మహోన్నతుడు అయ్యాడు . అయితే మే 30 2017న ఈ లోకాన్నివదిలి అందరికి అందని తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు మన దర్శకరత్న దాసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: