ఆ పండక్కి విడుదల కానున్న రజినీకాంత్ 166 వ సినిమా..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరియర్ లో ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమా లతో తమిళ నాట టాప్ హీరోగా ఎదగడం మాత్రమే కాకుండా కోలీవుడ్ లో నిర్మించిన సినిమా లను ఇతర భాషలలో విడుదల చేసి అనేక ప్రాంతాలలో కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫుల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.  అందులో భాగంగా రజనీ కాంత్ తెలుగులో కూడా దాదాపు స్టార్ హీరోల రేంజ్ లో తన క్రేజ్ ను  పెంచుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం విడుదల అయిన అన్నాత్తే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.  ఈ సినిమా పెద్దన్న పేరుతో తెలుగు లో కూడా విడుదల అయ్యింది.  ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సంపాదించుకొన్నప్పటికీ,  టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.  ఇది ఇలా ఉంటే పెద్దన్న సినిమా పరాజయంతో ఉన్న సూపర్ స్టార్ రజనీ కాంత్ మరి కొన్ని రోజుల్లో తన కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.  

ఈ మధ్య విజయ్ హీరోగా బీస్ట్ సినిమాను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలు రజనీ కాంత్ హీరోగా నటించబోతున్నాడు  కెరియర్ పరంగా రజిని కాంత్ కు ఇది 166 వ  సినిమా.  రజనీ కాంత్ ,  నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే  సినిమాను పిక్చర్స్ వారు నిర్మించనున్నారు.  ఈ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: