సుకుమార్ సినిమా కోసం విజయ్ అలా మారబోతున్నాడా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తన పంథాను మార్చుకుని సినిమాలు చేస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. క్లాస్ సినిమాలు చేసే ఈ దర్శకుడు గత రెండు సినిమాలుగా మాస్ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ చేసిన రంగస్థలం సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసిన పుష్ప చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా కి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. పాన్ ఇండియా చిత్రం గా ఈ సినిమా విడుదల కాగా భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప రెండవ భాగం సినిమా పైనే ఇప్పుడు అందరి చూపు పడింది. ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని అందుకోవాలని బన్నీ అభిమానులు భావిస్తూ ఉండగా వారి అంచనాలకు తగ్గట్లుగా పనులు చేస్తున్నాడట. సుకుమార్ అయితే ఈ చిత్రం తర్వాత చేయబోయే సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం పుష్ప సినిమా పైన ఉంటాడు కాబట్టి సుకుమార్ వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆలోచన చేయబోతున్నాడని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ను వేరే స్థాయి హీరోగా చూపించబోతున్నాడు అని అంటున్నారు. ఇప్పటిదాకా మాస్ పాత్రలు ఎం తో అద్భుతంగా ఆవిష్కరించిన సుకుమార్ విజయ్ దేవరకొండ ఆ అవతారంలో సరికొత్తగా చూపించబోతున్నారు. ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద విజయం సాధించడం ఖాయం అని చెబుతున్నారు. వరుస సినిమాలతో తమ స్థాయిని పెంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి రేంజ్ కు ఎదుగుతాడు చూడా లి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: