బాలీవుడ్ పై మహేష్ నిర్లిప్తత !

Seetha Sailaja
తెలుగు హీరోలు అందరు పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మహేష్ మాత్రం తనకు ఆ ఆలోచనలు లేవని మరొకసారి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తన ఫేస్ కూడ బాలీవుడ్ కు సూటు అవ్వకపోవచ్చని అందువల్ల తనకు హిందీ సినిమాలలో నటించే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి మహేష్ తీయబోయే మూవీ పాన్ ఇండియా మార్కెట్ కు ఏవిధంగా సరిపోతుంది అంటూ అప్పుడే కొందరు సందేహాలను వెళ్ళబుచ్చడం మొదలుపెట్టేసారు.

రాజమౌళి సినిమాలు అన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో ఉంటాయి. ఆ బడ్జెట్ ను రాబెట్టుకోవాలి అంటే అతడి సినిమాలలో నటించే హీరోలకు బాలీవుడ్ లో కూడ మంచి మార్కెట్ ఉండాలి. అయితే మహేష్ దీనికి భిన్నంగా తాను బాలీవుడ్ కు సెట్ కాను అంటున్నాడు. దీనితో జక్కన్న మహేష్ తో తీయబోయే మూవీ బడ్జెట్ కొంతమేరకు తగ్గిపోతుందా అన్నసందేహాలు కూడ వస్తున్నాయి.

అయితే మహేష్ ఒక తెలివైన సమాధానం ఇచ్చాడు. తన తండ్రి కృష్ణ బయోపిక్ గురించి మాట్లాడుతూ తాను సూపర్ స్టార్ కృష్ణ గా నటించే ఆలోచనలేదని అయితే ఏదర్శకుడు అయినా తన తండ్రి జీవితం పై మంచి స్క్రిప్ట్ వ్రాసుకుని తన  దగ్గరకు తీసుకు వస్తే అతడిని ప్రోత్సహిస్తూ ఆమూవీని నిర్మిస్తాను అంటున్నాడు. వాస్తవానికి కృష్ణ జీవితంలో ప్రేక్షకుల హృదయాలను కదిలించే సంఘటనలు లేవు.

అందువల్ల కృష్ణ జీవితం బయోపిక్ కు సూటు అవ్వదు. దీనితో ఏదర్శకుడు కృష్ణ బయోపిక్ స్క్రిప్ట్ వ్రాసే సాహసం చేయదు. దీనితో ఇప్పట్లో మహేష్ కృష్ణ బయోపిక్ తీసే అవకాశాలు కనిపించడంలేదు. గతంలో నాగార్జున కూడ తన తండ్రి బయోపిక్ ను గురించి మాట్లాడుతూ దర్శకులకు ఇలాంటి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు అక్కినేని బయోపిక్ కార్యరూపం దాల్చలేదు. అదే పరిస్థితి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కు కూడ ఎదురయ్యే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: