రామ్ చరణ్ కు అది ఎంతో ఇబ్బంది అవుతుందా!!

P.Nishanth Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ముందుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న రామ్ చరణ్ ఆ విజయోత్సాహాన్ని తన తదుపరి సినిమా ఆచార్య విషయంలో కొనసాగించ లేకపోయాడు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది.. చిరు కి చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా ఫ్లాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ పొరపాట్లు లేకుండా చిరు జాగర్త పడుతున్నారు. చరణ్ కూడా ఈ విషయం లో జాగ్రత్త పడుతున్నారు. 

దాంతో ఆయన చేయబోయే తదుపరి సినిమాల విషయమై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో నే శంకర్ స్పెషల్ గా చేయాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా కూడా ఈ చిత్రం నుంచి వచ్చే లీకులు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆసక్తికరమైన విషయాలు లీకయ్యాయి. తాజాగా కూడా ఈ చిత్రం యొక్క షూటింగ్ లొకేషన్ లోని కొన్ని చిత్రాలు లీక్ అయ్యాయి.

దాంతో తప్పకుండా చరణ్ కు ఎంతో ఇబ్బంది అవుతుంది అని మెగా అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా అలాంటి కీలక మైన లీకులు కాకుండా చూసుకోవాలని దాని కోసం చిత్ర యూనిట్ పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని మెగా అభిమానులు భావిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నగా సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆ సమయంలో పలు భారీ సినిమాలు ఉన్న నేపథ్యంలో వాటికి పోటీగా ఈ సినిమా విడుదల అవుతుందా లేదా మరొక తేదీని చూసుకుంటుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: