ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తున్న హీరోయిన్లు వీరే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున వెంకటేష్ ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం ఈ స్టార్ సీనియర్ హీరోలు సరసన నటిస్తున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.


చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో  పాటు చిరంజీవి,  బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా  నటిస్తోంది.


బాలకృష్ణ :  నందమూరి నట సింహం బాలకృష్ణ  ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సిని మా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది.

 
నాగార్జున : ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో  హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.


వెంకటేష్ : ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ లో హీరో గా నటించాడు.  ఈ మూవీ లో వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: