విజయ్ దేవరకొండ ఇచ్చే సర్ప్రైజ్ అదిరిపోయింది..!!

P.Nishanth Kumar
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కానుకగా ఈ రోజు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు విడుదల అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ విడుదల కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ తేదీని చిత్ర బృందం ఈ రోజు ప్రకటించింది. మే 16వ తేదీన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను టైటిల్ ను రివీల్ చేసే విధంగా చిత్రబృందం క్లాత్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకు తన స్టామినా ను పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా ప్లాన్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో కలిసి రెండు సినిమాలను ప్లాన్ చేసిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. 

శివ నిర్వాణ తో కలిసి ప్రేమ కథ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సమంత సరసన నటిస్తున్నాడు ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది విడుదల కాబోతున్న ఉండడం విశేషం. ఇక సుకుమార్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. ఈ విధంగా ఈ నాలుగు సినిమాలతో విజయ్ దేవరకొండ ఈ రెండు సంవత్సరాలు ఫుల్ జోష్ లో ఉండబోతున్నాడు. మరి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న ఈ హీరో ఏ స్థాయిలో అక్కడ తన క్రేజ్ ను పెంచుకుంటాడో చూడాలి. ఆగస్టు 25 వ తేదీన లైగర్ సినిమా విడుదల కాబోతోంది. ఆ తరువాత శివ నిర్వాణ సినిమాను విడుదల చేయనున్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: