విజయ్ దేవరకొండ స్పీడ్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రలతో తన సినిమా కెరియర్ ని మొదలు పెట్టి పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు.  ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ప్రైస్ హీరోగా మారిపోయాడు.

ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ , శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. విజయ్ 'లైగర్'  సినిమా విడుదల కు ముందే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'జనగణమన'  అనే సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఇలా విజయ్ దేవరకొండ ఒక సినిమా విడుదల కాక ముందే మరొక సినిమాను లైన్ లో పెడుతూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: