సమంత కామెంట్స్ లో అంతరార్ధం !

Seetha Sailaja
నాగచైతన్య తో విడిపోయిన తరువాత సమంత తన కెరియర్ లో మరింత వేగాన్ని పెంచింది. ఒకవైపు వరసపెట్టి సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో కొన్ని భావయుక్తమైన పోష్టింగ్స్ పెడుతోంది. ఆ పోష్టింగ్స్ చదివిన వారికి రకరకాల సందేహాలు కలగడం సహజం.

ప్రేమ పెళ్లి జీవితం ఇలా పలు విషయాల పై సమంత పెడుతున్న కామెంట్స్ క్షణాలలో వైరల్ అవుతున్నాయి. ఈకామెంట్స్ ను సమంత యాదృశ్చికంగా పెడుతోందా లేదంటే ఎవరినైనా టార్గెట్ చేయాలని ఈకామెంట్స్ ఉద్దేశమా అన్నక్లారిటీ లేదు.
‘నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి’ అంటూ ఒక హాలీవుడ్ సినిమా గురించి సమంత పోస్ట్ పెట్టింది. అయితే ఈకామెంట్స్ ఆమె వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది.  

లేటెస్ట్ గా ఆమె నటించిన తమిళ మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో ఆమె ఆశలు అన్నీ ఆగష్టు 12న విడుదలకాబోతున్న  ‘యశోద’ పై ఉన్నాయి. ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన  ఫస్ట్ గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈమూవీ కూడ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతూ ఏకంగా ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ కు పోటీగా విడుదల కావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ తో ఒక మూవీ చేస్తూ గుణ శేఖర్ ‘శాకుంతలం’ సినిమా గురించి ఎదురు చూస్తోంది. అంతేకాదు ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఇంగ్లీష్ మూవీతో సమంత హాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ టాప్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడ నటించబోతోంది. ఆమె కుటుంబసభ్యుల ఒత్తిడితో సమంత వచ్చే ఏడాది పెళ్ళి చేసుకునే అవకాశం ఉంది అంటూ కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: