ప్రపంచవ్యాప్తంగా 'సర్కారు వారి పాట' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.  ఈ సినిమాకు పరుశురామ్  దర్శకత్వం వహించగా తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా మే 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఉండడం,  గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో సర్కారు వారి పాట సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది.  సర్కారు వారి పాట  మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన  ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం.

 
సర్కారు వారి పాట సినిమా నైజాం లో 36 కోట్లు , వైజాగ్ 13.0 కోట్లు , ఈస్ట్ 8.5 కోట్లు , వెస్ట్ 7 కోట్లు ,  కృష్ణ 7.5 కోట్లు , గుంటూర్ 9 కోట్లు , నెల్లూర్ 4 కోట్లు , సీడెడ్ 13.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా 98.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏం జరుగుతుంది.
ఇక సర్కారు వారి పాట మూవీ కర్ణాటకలో 8.5 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్లు , ఓవర్సిస్ లో 11 కోట్లు , పి & పి లో 4 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుపుకుంది.

 
మొత్తంగా సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర క్లీన్ గా హిట్ గా నిలవాలి అంటే 126 కోట్ల కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: