బాలకృష్ణ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ సినిమాలు..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఎన్నో కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేయడానికి కారణం , ఆ సమయంలో ఆ కథ ఆ హీరోగా నచ్చకపోవడం అయి ఉండవచ్చు లేదా ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్  చేయలేక పోయి ఉండవచ్చు,  మరియు ఇతర కారణాలు కూడా అయి ఉండవచ్చు.  అయితే అలా ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా కథను  మరొక హీరోతో తెరకెక్కించిన సందర్భంలో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉంటాయి.  అలా నందమూరి నటసింహం బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలలో  బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఐదు సినిమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 
చంటి : విక్టరీ వెంకటేష్ హీరోగా మీనా హీరోయిన్ గా తెరకెక్కిన చంటి సినిమా కథ నచ్చక పోవడం వల్ల బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ వద్దకు వెళ్లిందట.  ఈ సినిమాతో వెంకటేష్ భారీ బ్లాక్ బస్టర్ విజయం బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.


జానకి రాముడు : నాగార్జున హీరోగా విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన జానకి రాముడు కథ మొదటగా బాలకృష్ణ వద్దకు వెళ్లిందట,  ఆ కథ నచ్చకపోవడంతో బాలకృష్ణ రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత నాగార్జున హీరోగా తెరకెక్కిన జానకి రాముడు సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


సింహరాశి : రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సింహరాశి కథ మొదటగా బాలకృష్ణ వద్దకు వెళ్లిందట,  బాలకృష్ణ రిజక్ట్ చేయడంతో రాజశేఖర్ తో  ఈ సినిమాను తెరకెక్కించట.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.


సూర్యవంశం : వెంకటేష్ , మీనా హీరో , హీరోయిన్ లుగా తెరకెక్కిన సూర్యవంశం కథ మొదట బాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట.  బాలకృష్ణ రిజక్ట్ చేయడంతో వెంకటేష్ హీరోగా తెరకెక్కించరట.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.


సింహాద్రి : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సింహాద్రి కథ మొదటగా బాలకృష్ణ దగ్గరకు వెళ్లిందట,  బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ తో ఈ సినిమాను చిత్రీకరించారట,  ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: