డెలివరీ తర్వాత స్టాన్నింగ్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఎంతో మంది ముద్దుగుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు.  లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ 'చందమామ'  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.  ఆ తర్వాత మగధీర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాజల్ అగర్వాల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది.  అలా మగధీర లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కాజల్ అగర్వాల్ కు వరుస పెట్టి సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కాయి.  

అందులో భాగంగా కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన కాజల్ అగర్వాల్ దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ లోని అందరు స్టార్ హీరో లతో ఆడిపాడింది.  ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉన్న సమయం లోనే కాజల్ అగర్వాల్ , గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.  

వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కొన్ని సినిమాలలో నటించింది.  వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ 'ఆచార్య'  సినిమాలో  నటించినప్పటికీ కథకు అనుగుణంగా కాజల్ అగర్వాల్ పాత్ర లేకపోవడంతో ఆ పాత్రను తీసి వేయణునట్లు,  అదే విషయాన్ని కాజల్ కు చెపితే నవ్వుతూ స్వీకరించినట్లు దర్శకుడు కొరటాల శివ తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.  ఆమె తాజాగా తన డెలివరీ తర్వాత ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  బిడ్డకు తల్లి అయినా కూడా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పే విధంగా స్టాన్నింగ్ లుక్ లో  ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫొటో ఉంది. ఇకపోతే తన బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది,  అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: