విశ్వక్ సేన్ శ్రీవిష్ణు లకు సవాల్ అంటున్న సుమ !

Seetha Sailaja
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎంతో బాగుంటే కానిప్రేక్షకులు రారు. నయనతార అనుష్క సమంత లాంటి టాప్ హీరోయిన్స్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడ గతంలో ఫ్లాప్ అయిన చరిత్ర ఉంది. అయితే యాంకర్ సుమ ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త నిర్మాతను నమ్ముకుని ‘జయమ్మ పంచాయితీ’ తో చేస్తున్న సాహసం విజయవంతం అయితే ఆమె పేరు మరింత మారుమ్రోగిపోయే ఆస్కారం ఉంది.

వాస్తవానికి ఈ జయమ్మ పాత్రను దర్శకుడు రమ్యకృష్ణ ను ఊహించుకుని క్రియేట్ చేసింది. అయితే ఆమె స్థానంలో సుమ చేరడంతో మొదట్లో ఈసినిమాను పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా సుమ ఈమూవీకి చేస్తున్న ప్రమోషన్ తో ఈమూవీ విషయం అందరికీ తెలిసిపోయింది. టాప్ హీరోలు పవన్ నాగార్జున మహేష్ లతో పాటు టాప్ దర్శకులు రాఘవేంద్రరావు రాజమౌళి లాంటి సెలెబ్రెటీలు కూడ ఈమూవీని ప్రమోట్ చేయడంతో ఈమూవీ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ఈమూవీ సింగిల్ గా రాకుండా ఏకంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విశ్వక్ సేన్ మూవీతో పోటీ పడుతోంది. అంతేకాదు మంచి నటుడుగా పేరున్న శ్రీవిష్ణు మూవీ కూడ సుమను టార్గెట్ చేస్తోంది. శ్రీకాకుళం ప్రాంత నేపధ్యంలో అక్కడి భాష యాసతో వచ్చిన సినిమాలు గతంలో ఒకటి రెండు హిట్ అయ్యాయి. నటిగా కెరియర్ ప్రారంభించి అక్కడ హిట్స్ అందుకోలేక చాలకాలం తరువాత ఇప్పుడు మళ్ళీ సుమ రీ ఎంట్రీ ఇస్తోంది.

అయితే ఇప్పుడు సినిమాలను చూసే ప్రేక్షకులలో ఎక్కువమంది యూత్ వీరు కాకుండా 40 సంవత్సరాలలోపు ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రమే ధియేటర్లకు వస్తున్నారు. వారంతా సినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత మాత్రమే ధియేటర్ల బాట పడుతున్నారు. దీనితో సము ‘జయమ్మ పంచాయితీ’ ఓటీటీ కి ఎక్కువ సినిమాకు తక్కువ అన్న కామెంట్స్ బారిన పడకుండా ఒక సర్ప్రైజ్ హిట్ కొట్టగలిగితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారీ సినిమాలలో సుమకు అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: