టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ , కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.  చందమామ సినిమాలో తన అందచందాలతో,  నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.  

మగధీర తర్వాత దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయం లోనే కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది.  గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న తర్వాత కూడా కాజల్ అగర్వాల్ కొన్ని సినిమాల్లో నటించింది.  ఆ తర్వాత కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.  

అలాగే కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత ఆచార్య సినిమాలో నటించింది.  కాకపోతే సినిమా కథకు కాజల్ పాత్రకు సంబంధం లేకపోవడంతో ఆ పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ మగ బిడ్డకు జన్మనిచ్చింది.  ఇది ఇలా ఉంటే ఇకపై కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చేపినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ పలువురు దర్శక ,  నిర్మాతలకు చెప్పినట్లు టాక్.  కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.  కాజల్ అగర్వాల్ కూడా తన బిడ్డ ఎదుగుదలను  దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఒక టాక్ నడుస్తుంది.  దీనిపై కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: