జబర్దస్త్ లోకి.. నవ్వుల రారాణి వచ్చేసిందోచ్?
దీంతో జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ కల్మషం లేని నవ్వు చూసిన తర్వాత.. రోజా కాకుండా ఇంద్రజా జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగిస్తే బాగుంటుంది అని ఎంతోమంది డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇంద్రజ నవ్వు మాకు బాగా నచ్చేసింది ఆమెనే కొనసాగించండి అంటూ కోరినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత రోజా మళ్లీ జడ్జిగా వచ్చేసింది. ఇటీవలే మంత్రి పదవి రావడంతో ఇక జబర్దస్త్ జడ్జిగా రోజా తప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల చివరి ఎపిసోడ్ కూడా చేసేసింది. దీంతో రోజా స్థానంలో ఎవరు వస్తారా అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఆ నవ్వుల రారాణి ఇంద్రజ మళ్ళీ వచ్చేసింది.
ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో భాగంగా ఇంద్రజ మరోసారి రోజా సీట్లోకి వచ్చి కామెడీని బాగా ఎంజాయ్ చేసింది. తన కల్మషం లేని నవ్వు తో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది. దీంతో రోజా జబర్దస్త్ జడ్జ్ గా వెళ్లిపోవడం పై బాధపడుతున్న ప్రేక్షకులు కొంత మంది అయితే.. ఇంద్రజ మళ్ళీ తిరిగి జబర్దస్త్ లో జడ్జిగా అవతారమెత్తింది అని సంతోషపడుతూ ఉన్న ప్రేక్షకులు మరికొంతమంది. రోజా మళ్లీ జడ్జిగా రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు..