అప్పుడు బోయపాటి.. ఇప్పుడు కొరటాల... ఫ్లాప్ వస్తే అంతేనా.!!

P.Nishanth Kumar
ఏదైనా సినిమా హిట్టయితే హీరో కి క్రెడిట్ వెళ్లడం  ఫ్లాప్ అయితే దర్శకుడు క్రెడిట్ లోకి వెళ్లడం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రెగ్యులర్ గా జరుగుతున్న విషయం. బోయపాటి శ్రీను విషయంలో ఇలాంటిదే జరిగింది. ఆయన దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించనీ నేపథ్యంలో ఆ సినిమా తన వల్లే డిజాస్టర్ అయ్యిందని బోయపాటి పై మెగా అభిమానులు ఎన్నో విమర్శలు చేశారు.  

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోను ఎలా వాడుకోవాలో తెలియకుండా సినిమా చేసి పరువు తీసేసాడు అని ఆయనపై ఎన్నో దారుణమైన విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ పై ఇలాంటి విమర్శలు చేస్తున్న ఈ రెండిటికీ కూడా మెగా హీరో హీరోలే హీరోలు కావడం గమనార్హం. రంగస్థలం సినిమా విషయంలో అందరూ రామ్ చరణ్  ను ఎక్కువగా పొగడగా సుకుమార్ ను పొగిడింది చాలా తక్కువ. ఆ సినిమా కోసం రామ్ చరణ్ కు ఎంతో బాగా కష్టపడ్డాడని అందుకే ఆ సినిమాకు అంతటి స్థాయిలో ఫలితం వచ్చిందనే అందరు చెప్పుకున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాకు మాత్రం ఆ బాధ్యతను తీసుకోలేకపోతున్నారు రామ్ చరణ్. వీరనే కాదు ఏ హీరో అయినా కూడా ఫ్లాప్ వస్తే దర్శకుడు మీదకు దానిని నెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొరటాల శివ ఈ ఆచార్య ముద్ర నుంచి ఏ విధంగా కోలుకుంటాడో చూడాలి. ఎన్టీఆర్ తో కలిసి ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. మే 20వ తేదీన ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్దే ను అనుకుంటున్నారు. ఇప్పటిదాకా అపజయం ఎరుగని దర్శకుడు గా ఉన్న కొరటాల తొలిసారి డిజాస్టర్ ను అందుకోగా ఈ సినిమాని ఏ స్థాయిలో తెరకెక్కించి హిట్ కొడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: