రాజశేఖర్ 'శేఖర్' మూవీ విడుదల తేదీ వచ్చేసింది..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ లో ఎన్నో ఎత్తు , పల్లాలను ఎదుర్కొన్న రాజశేఖర్ అలనాటి కాలంలో చిరంజీవి,  వెంకటేష్,  నాగార్జున , బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో బాక్సాఫీస్ దగ్గర తలపడి ఎన్నోసార్లు విజయాలను అందుకున్నాడు.  అలాగే అలనాటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి,  వెంకటేష్ , నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సమానంగా  రెమ్యునరేషన్ ను రాజశేఖర్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.  

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న రాజశేఖర్ కొంత కాలం వరస పరాజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.  అలా డీలా పడిపోయిన సందర్భంలోనే రాజశేఖర్ , ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడ వేగ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు.  ఆ తర్వాత రాజశేఖర్ 'కల్కి' సినిమాలో నటించాడు.  కాకపోతే ఈ సినిమా మరోసారి రాజశేఖర్బుకు  నిరాశనే మిగిల్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్'  అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  ఈ మూవీ ని లలిత్ అనే కొత్త డైరెక్టర్ తో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత  జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.  శేఖర్ మూవీ ని వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మిస్తున్నారు.

ఈ మూవీ లో  రాజశేఖర్ పెద్ద తనయ శివానీ రాజశేఖర్ ,  ఆయన కూతురు పాత్రలో నటించడం విశేషం. హీరోగా రాజశేఖర్‌ కు శేఖర్ మూవీ  కెరియర్ పరంగా 91వ సినిమా. శేఖర్ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించిన  ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి ఆధారంగా తెరకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. శేఖర్ మూవీ ని మే 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: