. ఇక బాలయ్య మాస్ సినిమా సందడి షురూ..!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. బాలయ్య 107 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా యొక్క టైటిల్ ఫిక్స్ అయినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్లు లేక ఎంతో సతమతమైన బాలకృష్ణకు అఖండ సినిమా భారీ విజయాన్ని తెచ్చి పెట్టింది. పోయిన ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి భారీ స్థాయిలో నిర్మాతలకు లాభాలు వచ్చాయి.

 ఆ సినిమా అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని భావిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కాబోతు ఉంది. ఇప్పటిదాకా ఎన్.బి.కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటు ఉండగా తాజాగా ఈ చిత్రానికి ఓ టైటిల్ ని ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

జై బాలయ్య, పెద్దన్నయ్య టైటిల్స్ ను యూనిట్ పరిశీలించగా మొన్నటిదాకా వీటినే టైటిల్స్ గా పెట్టాలని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ను లాక్ చేశారని చెబుతున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం యొక్క టైటిల్ ను అనౌన్స్ చేస్తారు అనే వార్త వినబడుతోంది. మరి ఇదే నిజమైతే నందమూరి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని చెప్పుకోవచ్చు. మాస్ యాక్షన్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తూ ఉండగా ఈ సినిమా కథకు ఈ టైటిల్ తప్పకుండా పవర్ఫుల్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: