'ఎన్ బి కె 107' కు ఆ రెండు టైటిల్ లను పరిశీలిస్తున్న చిత్రబృందం..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదలైన అఖండ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్ లను కూడా అఖండ మూవీ తో అందుకున్నాడు. ఈ మూవీ తో బాలకృష్ణ కెరియర్ బెస్ట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఇది ఇలా ఉంటే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.  

ఈ సినిమా  కెరియర్ పరంగా బాలకృష్ణ కు 107 వ సినిమా.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుండగా,  ఈ మూవీ లో దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.  అలాగే మరో కీలకమైన పాత్రలో ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి చిత్ర బృందం రెండు ఆసక్తికరమైన టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అందులో ఒకటి 'అన్నగారు' కాగా మరొకటి 'వీర సింహారెడ్డి'.  ఇందులో ఎక్కువ శాతం మంది అన్నగారు టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  దీనిపై మరి కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: