అతి తక్కువ ఎక్స్పీరియన్స్ తో స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో ఛాన్స్ లు కొట్టేసిన దర్శకులు వీరే..!

Pulgam Srinivas
కొంతకాలం క్రితం వరుస విజయాలు ఉంది  స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న తర్వాతే వారికి స్టార్ హీరోలు డేట్లు ఇచ్చేవారు.  అలాగే స్టార్ దర్శకుడుగా మారిన తర్వాతే  స్టార్ ప్రొడ్యూసర్లు దర్శకులకు అవకాశం ఇచ్చేవారు.  కానీ ప్రస్తుతం చాలా వరకు ఆ పరిస్థితులు మారాయి.  ఒకటి , రెండు సినిమాలతో తమ టాలెంట్ ను నిరూపించుకున్న దర్శకులకు స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు.  అలాగే ఒకటి ,  రెండు సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్న దర్శకులకు స్టార్ ప్రొడ్యూసర్ లు కూడా అవకాశం ఇస్తున్నారు.  అలా ప్రస్తుతం ఒకటి , రెండు సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకోని ప్రస్తుతం స్టార్ హీరోలతో , స్టార్ ప్రొడ్యూసర్ లతో పని చేసే  అవకాశాన్ని దక్కించుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం.


టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ దర్శకుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన మళ్ళీరావా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు.  ఇదే సినిమాను హిందీలో జెర్సీ పేరుతో తెరకెక్కించిన ఈ దర్శకుడు మరో విజయాన్ని బైక్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఇలా అతి తక్కువ అ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ దర్శకుడికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవకాశం ఇచ్చాడు.  ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు.

 
కార్తికేయ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించిన చందు మొండేటి ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్ లలో ఒకటి అయిన గీతా ఆర్ట్స్ లో పని చేయనున్నట్లు ఈ దర్శకుడే స్వయంగా తెలియజేశాడు.  ఇలా అతి తక్కువ ఎక్స్పీరియన్స్ తో ఈ దర్శకులు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో అవకాశాలను దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: