మొవీలో లేకపోయినప్పటికీ 'ఆచార్య' సినిమా కోసం కాజల్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం మాత్రమే కాకుండా ఈ సినిమా ద్వారా ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి కాజల్ అగర్వాల్ మంచి ప్రశంసలు అందుకుంది.  మగధీర సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.  

కాజల్ అగర్వాల్ కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ , హిందీ భాషల్లో కూడా అనేక సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కొన్ని రోజుల క్రితం ఆచార్య సినిమాలో కొంత భాగం షూటింగ్ లో పాల్గొంది.  కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కాజల్  కు సంబంధించిన సీన్స్ ఆచార్య చిత్ర బృందానికి సంతృప్తిని కలగజేయకపోవడంతో ఆ సినిమాలో హీరోయిన్ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ కాజల్ అగర్వాల్ ను ఆచార్య సినిమా నుండి తీసి వేసినట్లు తెలియజేశాడు.  

ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ కు తెలియజేయగా నవ్వుతూ మేము చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంది అని కొరటాల శివ తెలియజేశారు.  ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో  కనిపించకపోయినప్పటికీ ఆచార్య సినిమా కోసం కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ను ఈ ముద్దుగుమ్మ తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో నటించకపోయిన  కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: