'ఆచార్య' సినిమాలో అనుష్క... ఏ పాత్రలో అనుకుంటున్నారా..?

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి. ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా... ఇప్పుడు థియేటర్ లలో మూవీ ని చూద్దామ అని మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు అంతలా ఎదురు చూడడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య కలిసి ఉండడం ఒక కారణం అయితే,  ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ 'ఆచార్య' మూవీ కి దర్శకత్వం వహించడం మరొక కారణం.  

ఇలా అనేక కారణాల వల్ల ప్రేక్షకులు ఆచార్య సినిమాపై అదిరిపోయే రేంజ్ అంచనాలను పెట్టుకున్నారు.  ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.  సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.  ఆచార్య సినిమా లోని  ఒక స్పెషల్ సాంగ్ లో అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా కనిపించబోతుంది.  

ఇప్పటికే రేజీనా కాసండ్ర నటించిన స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఆచార్య సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన అనుష్క శెట్టి కనిపించబోతున్నట్లు ఒక వార్త నెటింట్లో వైరల్ అవుతుంది.  అయితే అనుష్క శెట్టి 'ఆచార్య'  సినిమా లోని ఒక సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు ఆచార్య సినిమాలో అనుష్క కనిపించబోతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: