ప్రదీప్ ఇచ్చిన సర్ ప్రైజ్ కు కన్నీళ్లు పెట్టుకున్న నందితా శ్వేత..!!

Divya
తాజాగా బుల్లితెర పై ప్రసారమవుతున్న పాపులర్ షోలలో ఢీ డాన్స్ షో కూడా ఒకటి. ప్రస్తుతం పదమూడవ సీజన్ ను  పూర్తి చేసుకొని 14వ సీజన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఏప్రిల్ 30వ తేదీన నందిత శ్వేత పుట్టినరోజు కావడంతో ఢీ ఫ్యామిలీ నుంచి ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రదీప్ మాచిరాజు అందజేయడం జరిగింది. అంతేకాదు ఆమె కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక గిఫ్ట్ చూసిన వెంటనే నందితా శ్వేత కన్నీటి పర్యంతం అయ్యింది. అయితే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ లో ఏముంది అనే విషయం తెలియాలి అంటే ఏప్రిల్ 27వ తేదీ షో ప్రసారం అయ్యే వరకూ ఎదురుచూడక తప్పదు.
ఇదిలా ఉండగా గత కొన్ని నెలల నుంచి ఢీ షో నుంచి సుధీర్ హఠాత్తుగా తప్పకున్న విషయం తెలిసిందే. ఇక సుధీర్ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సుధీర్,  రష్మీ ఢీ స్టేజిపై మళ్లీ రావాలి అని..  ప్రేక్షకులను అలరించాలని అభిమానులు డైలీ కామెంట్లు కూడా చేస్తున్నారు. వారిరువురి ఎంట్రీ కోసం సంబంధించిన ఒక ప్రకటన ఈ ఎపిసోడ్లో ఉండబోతోంది అన్నట్లుగా సమాచారం. ఢీ షో నుంచి సుధీర్ తప్పుకున్న తర్వాత షో యొక్క రేటింగ్స్ కూడా తగ్గుముఖం పట్టడంతో అతని రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన షో నిర్వాహకులు కూడా వచ్చినట్లు తెలిసింది.
ఏమైనా ఈవారం ప్రసారం కాబోతున్న షో లో సుధీర్ ఎంట్రీ గురించి ప్రకటన ఇవ్వడం జరుగుతుందట. ఇక తర్వాత ప్రియమణి, నందితా శ్వేత తో పాటు ఢీ స్టేజిపై ఉన్న మహిళలందరూ నీ కి ముద్దులు ఇవ్వడం .. ఆది పంచులు వేయడం కూడా ప్రోమో లో నవ్వులు పూయించింది. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది ఈ షో ప్రోమో అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: