బుల్లితెరపై కూడా అదరగొట్టిన బాలకృష్ణ 'అఖండ'...ఎంత 'టిఆర్పి' ని సాధించిందో తెలుసా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ కీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో హిట్,  సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో ఉన్న సమయంలో అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అఖండ ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు,  పూర్ణ  అఖండ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించింది. అఖండ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.  పోయిన సంవత్సరం విడుదలైన అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది.  బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా కొంతకాలం క్రితం నుండి 'ఓ టి టి' లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.  

అఖండ సినిమా 'ఓ టి టి'  ప్రేక్షకులను కూడా బాగానే  అలరించింది.  ఇలా థియేటర్ లలో అలాగే 'ఓ టి టి' లలో ప్రేక్షకులను అలరించిన అఖండ సినిమా కొన్ని రోజుల క్రితం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది.  అఖండ సినిమా బుల్లితెర ప్రేక్షకులను కూడా అద్భుతంగా అలరించింది.  అఖండ సినిమా మొదటి సారి బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 13.31 'టి ఆర్ పి' ని సొంతం చేసుకుంది.  ఇలా అఖండ సినిమా థియేటర్ ప్రేక్షకులను,  'ఓ టి టి'  ప్రేక్షకులను బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: