సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను అప్పట్లో జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ వస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుండి చిత్ర బృందం రెండు లిరికల్ వీడియో సాంగ్ లను విడుదల చేసింది. ఈ రెండు లిరికాల్ వీడియో సాంగ్ లకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా నుండి మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా తెలియజేసింది. సర్కార్ వారి పాట సినిమా లోని మూడవ లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 23 వ తేదీ ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చీటీ బృందం తెలియజేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా సర్కార్ వాడి పాట మూవీ నిర్మిస్తున్నారు. సర్కార్ వాడి పాట సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.