కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటో తెలుసా..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి  ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కింది.  అందులో భాగంగా కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని  స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.
 

అలా స్టార్ హీరోయిన్ ల సరసన కాజల్ అగర్వాల్ చేరడం మాత్రమే కాకుండా ఎంతో కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.  ఇది ఇలా ఉంటే  కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ 2020 వ సంవత్సరం అక్టోబర్ నెలలో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.  తాజాగా  కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ  విషయాన్ని కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇది ఇలా ఉంటే  కాజల్ అగర్వాల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి కాజల్ అగర్వాల్ అభిమానుల్లో నెలకొంది. ఈ విషయానికి సంబంధించి నిషా అగర్వాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాజల్ అగర్వాల్  కుమారుడికి 'నీల్ కిచ్లూ' అనే పేరు పెడుతున్నట్టు ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: