జబర్దస్త్ లోకి రోజా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుందా?

Satvika
ఈటీవీ లో ప్రసారం అవుతున్న టాప్ రియాల్టీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మందిని కమెడియన్‌ లుగా అందరికి పరిచయం చేశారు..వారంతా టీవీ షోలు, వరుస సినిమా లతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఎందరో మంచి కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్నారు.. మరి కొంతమంది మాత్రం హీరోలు గా కూడా పరిచయం అయ్యారు. అలాంటి నవ్వుల షో కు జడ్జీల నవ్వు మరింత అందం అని చెప్పాలి.ముఖ్యంగా రోజా నవ్వు ఆ షోకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది.ఎవరున్నా లేకున్నా రోజా వుంటే చాలు షో హిట్ అవుతుంది అని అందరు నమ్ముతున్నారు..


ఎమ్మెల్యే గా వున్నప్పుడు కూడా జబర్దస్త్ షోను విదవలెదు.. కానీ ఇప్పుడు మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజిగా ఉన్న నేపథ్యంలో జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందనె వార్తలు వినిపిస్తున్నాయి..రోజా దాదాపు పది సంవత్సరాలుగా జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటుంది.మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న వెంటనే రోజా తాను జబర్దస్త్ ను వీడబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.. ఆ స్టేజ్ పైన ఎమ్మెల్యేగా పనిచెసాను, ఇప్పుడు మంత్రిగా కూడా చేశాను అంటూ ఎమొషనల్ అయిన సంగతి తెలిసిందే.


కాగా,హీరోయిన్ గా సినీ కెరీర్ ను ఆరంభించిన రోజా ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నటిగా ఆమె సినీ ప్రస్థానం ఎంత విజయం సాధించిందో జబర్దస్త్‌ కూడా ఆమెకు అంతగా  మంచి పేరును అందించింది.ఆమె నవ్వు లేనిదే షో మూగ బోతుందని చాలా మంది అనడం మనం వినే ఉంటాము..2024 ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకున్నా కూడా మళ్లీ మంత్రి వర్గ కూర్పులో భాగంగా రోజాకు ఛాన్స్ రాకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.. అప్పుడు మళ్ళీ ఈ షో లోకి రీ ఎంట్రీ ఇస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందె..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: