ఇన్నాళ్లకు మెరిసిన అందాల అనూ..!!

Divya
సినీ ఇండస్ట్రీ అనే రంగుల మాయ ప్రపంచం లో అందం.. ప్రతిభ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలిసి రావాలి.. కొంతమంది కథానాయికలు అన్నీ ఉన్నా కూడా అవకాశాలు లేకపోవడం బాధాకరమని చెప్పాలి. ఇక ఈ  కేటగిరీలో పరిశీలిస్తే ప్రతిభతో మెప్పించి అందంతో దూసుకుపోతుందని మలయాళం బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ గురించి అందరూ అనుకున్నారు. ఇక అలా నాపేరు సూర్య,  అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంటుంది అంటే ఇక ఈమెకు ఈ రెండు సినిమాల తర్వాత అవకాశాలు కూడా లేకుండా పోయాయి.

ఇక ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ కొత్త హీరోలతో నటించడానికి సిద్ధం అయింది. ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ ఈమె నటించిన ఏ సినిమా కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం. దేనికైనా కాలం కలసి రావాలి అంటారు కదా.. ఇక ప్రస్తుతానికి అను గ్లామర్ ఎలివేషన్ తో ఇన్స్టా ఫోటో షూట్ లతో బాగా వేడెక్కిస్తోంది. తనదైన యూనిక్ స్టైల్ తో అల్ట్రా మోడల్ తో అందరినీ కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. స్వదేశీ సంస్కృతికి దూరంగా గల్ఫ్ లో పెరిగిన ఈమె మోడ్రన్ గా  కనిపించడానికి బాగా ఇష్టపడుతుంది. ఇక అంతే కాదు సినిమాల్లో అందాలను ఆరబోయడంలో తనకు కొత్త ఏమీ కాదు. అందుకే ఫోటో షూట్లతో మరింత అందంగా యువతను ఆకట్టుకుంటుంది.
తాజాగా అనూ షేర్ చేసిన ఒక ఫోటో షూట్ స్పెషల్ గా అందరినీ ఆకట్టుకుంటోంది.. ఇక చిట్టి పొట్టి చినుగుల డెనిమ్ షార్ట్ వేసుకొని అందుకు కాంబినేషన్ గా బాడీ హగ్ టాప్ ను ధరించి చూపరుల మతి పోగొడుతోంది. అంతేకాదు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉండడంతో క్షణాల్లో ఆమె అందాలను చూసి యువత మొత్తం ఫిదా అవుతున్నారు. ఇక అల్లు శిరీష్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది అను.. ఇక ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: